logo

కల్లంలో మిర్చి చోరీ

కల్లంలో రాశిగా ఉన్న మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు టిక్కీల్లోకి ఎత్తుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. పోలీసులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. యడ్లపాడుకు చెందిన కల్లూరి శ్రీనివాసరావు 15 క్వింటాళ్ల మిర్చిని ఇటీవల.

Published : 31 Mar 2023 05:34 IST

యడ్లపాడు: కల్లంలో రాశిగా ఉన్న మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు టిక్కీల్లోకి ఎత్తుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. పోలీసులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. యడ్లపాడుకు చెందిన కల్లూరి శ్రీనివాసరావు 15 క్వింటాళ్ల మిర్చిని ఇటీవల జాతీయ రహదారికి సమీపంలోని కల్లంలో ఆరబోశారు. మిర్చి ఎండిపోవటంతో కల్లంలోనే రాశిగా పోసి, పైన పట్టా కప్పారు. మిర్చిని అమ్మటం కోసం ఖాళీ టిక్కీలను కల్లంలో సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు కల్లం నుంచి ఇంటికి వెళ్లారు. తిరిగి 3 గంటలకు వచ్చి చూడగా రాశిలో ఓ పక్క క్వింటా తరుగు కనిపించింది. రెండు టిక్కీలు కనిపించలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చిని టిక్కీలో పోసుకుని వెళ్లినట్లు గుర్తించారు. ద్విచక్ర వాహనంపై రెండు టిక్కీలను పెట్టుకుని సర్వీసురోడ్డులో పోలీస్‌స్టేషన్‌ ముందుగా వెళుతున్న ఇద్దరు యువకులను గమనించినట్లు ఇద్దర ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమేరకు శ్రీనివాసరావు రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని