logo

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీరాల హరిప్రసాద్‌నగర్‌కు చెందిన వడ్లమూడి సుబ్బారావు(48) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంటారు.

Published : 31 Mar 2023 05:34 IST

చీరాల నేరవిభాగం, న్యూస్‌టుడే: వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీరాల హరిప్రసాద్‌నగర్‌కు చెందిన వడ్లమూడి సుబ్బారావు(48) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంటారు. ఇతనికి భార్య లక్ష్మి, పాప, బాబు సంతానం. బుధవారం రాత్రి సుబ్బారావు ద్విచక్ర వాహనంపై మండల పరిధిలోని గవినివారిపాలెంలో బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి బయలుదేరారు. ఈ సమయంలో పిట్టువారిపాలెం -గవినివారిపాలెం రోడ్డులో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన సుబ్బారావు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న వెంటనే ఈపూరుపాలెం ఎస్సై జనార్దన్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు.

ద్విచక్ర వాహనం సర్వీసుకు ఇచ్చేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా... మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన వాడరేవు రోడ్డులోని వాకావారిపాలెంలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం వాడరేవుకు చెందిన జి.సాగర్‌(18) ఇతని స్నేహితుడు యాకోబుతో కలిసి ద్విచక్ర వాహనంపై చీరాల వస్తున్నారు. మార్గంమధ్యలో వాకావారిపాలెం సమీపానికి రాగానే వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న సాగర్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. వెనుక కూర్చున్న యాకోబు కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని వెంటనే వాహనంలో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సాగర్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సాగర్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యాకోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని