logo

జిల్లెళ్లమూడి అమ్మ బోధనలు అనుసరణీయం

సమ సమాజ సాధనకు జిల్లెళ్లమూడి అమ్మ చేసిన బోధనలు అనుసరణీయమని కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి అన్నారు.

Published : 01 Apr 2023 05:38 IST

జయహో మాతా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి

బాపట్ల, న్యూస్‌టుడే: సమ సమాజ సాధనకు జిల్లెళ్లమూడి అమ్మ చేసిన బోధనలు అనుసరణీయమని కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. జిల్లెళ్లమూడిలో నిర్వహిస్తున్న అమ్మ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జిల్లెళ్లమూడి ఆధునిక దేవాలయమని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చటంలో అమ్మ దైవత్వాన్ని చూసిందన్నారు. సేవ చేయటంలో గొప్ప సంతృప్తి లభిస్తుందన్నారు. పూర్వ విద్యార్థులు రచించిన జయహో మాతా పుస్తకాన్ని ఆవిష్కరించారు. పెదపులిపాక విజయ రాజరాజేశ్వరి పీఠం పీఠాధిపతి వాసుదేవానంద సరస్వతీ స్వామి మాట్లాడుతూ తోటి వారికి చేతనైన సాయం చేయటమే గొప్ప పుణ్యకార్యక్రమమన్నారు. అమ్మ లక్షల మంది భక్తుల్లో జ్ఞాన జ్యోతి వెలిగించిందన్నారు. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ అమ్మ స్ఫూర్తితో సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆకలిదప్పులు లేని సమాజం రావాలన్న అమ్మ ఆశయం నెరవేర్చటమే ధ్యేయంగా భక్తులు పని చేయాలని పేర్కొన్నారు. ఉత్సవాల్లో రాత్రి మల్లాప్రగడ చారుమతీ పల్లవి బృందం లలిత శాస్త్రీయ సంగీత వాహిని ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నారు. విశ్వజననీ పరిషత్‌ ట్రస్టు సభ్యులు బొప్పూడి రామబ్రహ్మం, బ్రహ్మాండం రవీంద్రరావు, గిరిధర్‌కుమార్‌, రచయితలు కొండముది సుబ్బారావు, జయంతి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని