logo

యువ ఇంజినీర్ల మేధస్సు దేశానికి ఉపయోగపడాలి

యువ ఇంజినీర్ల మేధస్సు దేశ హితానికి ఉపయోగపడాలని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ అన్నారు.

Published : 01 Apr 2023 05:38 IST

జయప్రకాష్‌ నారాయణకు జ్ఞాపిక అందజేస్తున్న కళాశాల ప్రతినిధులు

బాపట్ల, న్యూస్‌టుడే: యువ ఇంజినీర్ల మేధస్సు దేశ హితానికి ఉపయోగపడాలని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థుల ఉద్దేశించి ఆయన శుక్రవారం మాట్లాడారు. దేశంలో సహజ, మానవ వనరులకు కొరత లేదన్నారు. వనరులు సద్వినియోగమైతే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి విద్యార్థి తన కుటుంబంతో పాటు సమాజాన్ని ప్రేమించాలని, సమాజ సేవ చేయాలని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలన్నారు. ప్రతిభ, నైపుణ్యాలతోనే పోటీ ప్రపంచంలో రాణించగలరన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని, పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు సాధించి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జయప్రకాష్‌ నారాయణకు జ్ఞాపిక అందజేసి సత్కరించారు. బీఈఎస్‌ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దొప్పలపూడి రామ్మోహన్‌, సంయుక్త కార్యదర్శి కొమ్మినేని హరిపద్మప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ షేక్‌ నజీర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి నిరంజన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని