logo

సజావుగా బార్‌ అసోసియేషన్‌ పోలింగ్‌

గుంటూరు బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గానికి శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 1,965 మంది న్యాయవాదులకు ఓటు హక్కు ఉండగా 1600 మంది వినియోగించుకున్నారు.

Published : 01 Apr 2023 05:38 IST

ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

గుంటూరులీగల్‌, న్యూస్‌టుడే: గుంటూరు బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గానికి శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 1,965 మంది న్యాయవాదులకు ఓటు హక్కు ఉండగా 1600 మంది వినియోగించుకున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో కౌంటింగ్‌ ప్రారంభించారు. పలు పదవులకు ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి నలుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ముగ్గురు, ఉపాధ్యక్షులు పదవులకు ముగ్గురికి పైగా పోటీ పడ్డారు. ఇతర పదవులకూ పోటీ ఎక్కువగా ఉండటంతో ఏర్పడిన గందరగోళంతో కౌంటింగ్‌ ప్రక్రియ కొంత సమయం నిలిచిపోయింది. ఎన్నికల అధికారి మరుసటి రోజు చేద్దామని ప్రతిపాదించగా, పోటీలో ఉన్న న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత కౌంటింగ్‌ ప్రారంభమైంది. అప్పుడు బ్యాలెట్ పేపర్లు పదవుల వారీగా వేరు చేయడం ప్రారంభించారు. ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితాల కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు, న్యాయవాదులు కోర్టు వద్ద జాగారం చేశారు. మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, మాజీ మేయర్‌ చుక్కా ఏసురత్నం, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని