logo

గుంటూరు జీజీహెచ్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు రూ.65 లక్షల మందులు అందించిన నాట్కో ఫార్మా

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబును నాట్కో ఫార్మా ఛైర్మన్‌, ఎండీ కలిశారు.  గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌కు రూ.65 లక్షల విలువైన మందులను అందజేశారు.

Updated : 21 Feb 2024 14:30 IST

మంగళగిరి: క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యసేవల్ని అందించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీలో కృష్ణబాబును నాట్కో ఫార్మా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ నన్నపనేని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌కు రూ.65 లక్షల విలువైన మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఫార్మా ఛైర్మన్‌ నన్నపనేని మాట్లాడుతూ.. నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి రోగులకు ఉచితంగా మందుల్ని అందజేస్తామని చెప్పారు. నాట్కో ట్రస్టు సేవల్ని మిగతా కార్పొరేట్ సంస్థలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని కృష్ణ బాబు పిలుపునిచ్చారు. కృష్ణబాబును కలిసిన వారిలో నాట్కో ఫార్మా కార్పొరేట్ వ్యవహారాల వైస్ ఛైర్మన్ నన్నపనేని సదాశివరావు, సంస్థ ఉద్యోగులు అవినాష్, కరీం ఉన్నారు. జీజీహెచ్‌లో రూ.45 కోట్ల వ్యయంతో నెలకొల్పిన నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ 2020జులైలో ప్రారంభించారు. అప్పట్నుంచి నాట్కో ఫార్మా ఖరీదైన క్యాన్సర్ మందుల్ని ఉచితంగా అందజేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని