రామానాయుడు ఆశీస్సుల కోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నదే తమ అభిమతమని సినీనటుడు దగ్గుబాటి అభిరామ్ అన్నారు.
కారంచేడు (పర్చూరు) న్యూస్‌టుడే : ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నదే తమ అభిమతమని సినీనటుడు దగ్గుబాటి అభిరామ్ అన్నారు. కారంచేడులో ఆదివారం ఆయన నివాసంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కారంచేడుకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు ఆశీస్సుల కోసమే ఈ ప్రాంతంలో అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు వినోదం కలిగించే సినిమాలు తీయాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. దర్శకుడు తేజ ఎంతో మంది కళాకారులకు నటనపరంగా ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి అని కొనియాడారు. కథానాయకుడు ఎలా ఉండాలో తేజ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, అహింస సినిమా జూన్ 2న విడుదలైన తర్వాత వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు
-
Union Cabinet: పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సిలిండర్‌పై రాయితీ ₹300లకు పెంపు
-
Nellore: నెల్లూరులో ఉద్రిక్తత.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Sai Pallavi: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి ఫిక్స్!
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!