logo

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనర్లు

నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పనిచేసిన ట్రైనర్లు తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్యాలయం ముందు సోమవారం ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డారు.

Updated : 29 May 2023 16:31 IST

గుంటూరు: నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పనిచేసిన ట్రైనర్లు తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్యాలయం ముందు సోమవారం ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ముగ్గురు ట్రైనర్లు పురుగుల మందు తాగారు. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం గత ప్రభుత్వం ట్రైనర్లను నియమిస్తే తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల్లోకి తీసుకోవడం సహా వేతనాలు ఇవ్వాలనే డిమాండ్‌తో రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు 854 మంది ట్రైనర్లను ఉద్యోగాల నుంచి తొలగించారని.. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికిగానూ 6 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసినా న్యాయం జరగలేదని ట్రైనర్లు వాపోయారు. న్యాయం చేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు