logo

రేపు గుంటూరులో సీఎం పర్యటన వివరాలిలా..

వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం రెండో విడత మెగా మేళాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జూన్‌ 2వ తేదీన జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం చుట్టుగుంట కూడలిలో ఏర్పాట్లు చేస్తుంది.

Published : 01 Jun 2023 03:37 IST

మిర్చియార్డులో ట్రాక్టరు పరిశీలిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

గుంటూరు, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం రెండో విడత మెగా మేళాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జూన్‌ 2వ తేదీన జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం చుట్టుగుంట కూడలిలో ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం ఉదయం 9.35 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.40 గంటలకు గుంటూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటలకు రోడ్డు మార్గాన చుట్టుగుంట కూడలికి బయలుదేరుతారు. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద అందించనున్న ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు సీఎం జెండా ఊపి ప్రారంభిస్తారు. 10.50 గంటలకు చుట్టుగుంట నుంచి బయలుదేరి పోలీసు కవాతు మైదానంలో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడే స్థానిక నాయకులతో కొంత సమయం మాట్లాడిన తర్వాత హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లికి చేరుకోనున్నారు. మిర్చియార్డు ఆవరణలో ఉంచిన ట్రాక్టర్లను గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. జిల్లాల వారీగా వాటిని వరుస క్రమంలో ఉంచాలని అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని