విధుల్లో లేని వైద్యులు
విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్య అధికారులు విధుల్లో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని బుధవారం అత్తలూరు పర్యటనకు వచ్చిన కలెక్టర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ ఆగ్రహం
చర్యలకు ఆదేశం
ఆసుపత్రిని పరిశీలిస్తున్న కలెక్టర్ శివశంకర్
అమరావతి, న్యూస్‌టుడే : విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్య అధికారులు విధుల్లో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని బుధవారం అత్తలూరు పర్యటనకు వచ్చిన కలెక్టర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన ఇద్దరు వైద్యులు రవిబాబు, శివరత్నకుమార్, స్టాఫ్ నర్సు దుర్గా అసుపత్రిలో లేకపోవడాన్ని గుర్తించారు. వైద్యుల గదుల్లో కుర్చీలు ఖాళీగా ఉండటం చూసి విస్తుపోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణులకు ఇలా వైద్య సేవలు అందిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు వైద్యులు, స్టాఫ్ నర్సుకు నోటీసులు జారీ చేసి ఏ చర్యలు తీసుకున్నారో కలెక్టర్ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఆర్డీఓ రాజకుమారి ఉన్నారు.
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం
అమరావతి : జగనన్న కాలనీల్లోని ఇళ్ల వద్ద ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శివశంకర్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని జూపూడి పేదల ఇళ్ల గృహ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. స్థలం పట్టా మంజూరై ఇంకా పనులు మొదలు పెట్టని వారిని గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎంపీడీఓ మాధురి, ఏఈ శ్రీనివాసరావు, ఆర్‌ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ