‘తెదేపా ఎన్నికల ప్రణాళికతో వైకాపాకు ముచ్చెమటలు’
తెదేపా ఎన్నికల మేనిఫెస్టో సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. గుంటూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మాట్లాడుతున్న తెనాలి శ్రావణ్‌కుమార్, పక్కన దాసరి రాజామాస్టారు తదితరులు
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: తెదేపా ఎన్నికల మేనిఫెస్టో సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. గుంటూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెదేపా మేనిఫెస్టోలో రూపొందించిన పథకాలు అందరి నోళ్లలో నానుతుండటంతో వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అమ్మఒడి పేరుతో తల్లుల్ని, పింఛన్లు ఇస్తానని చెప్పి వృద్ధులను కూడా నయవంచన చేసిన ఘనుడు జగన్. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీలు గుప్పించి.. వైకాపా కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. తక్షణమే ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే రూ.3000 కోట్లతో ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఎక్కడకు పోయింది. దళితులపై దాడులు జరుగుతుంటే మంత్రి మేరుగు నాగార్జున నోరు ఎందుకు మెదపడం లేదు. చంద్రబాబు తీసుకువచ్చిన పరిశ్రమలపై వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు దుందుడుకుగా వ్యవహరించడం వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా పోయాయి’.. అని దుయ్యబట్టారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాస్టారు మాట్లాడుతూ జగన్ పాలన వల్ల అన్ని సామాజిక వర్గాలు విసిగిపోయాయన్నారు. కాపుల గురించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే కాపుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో తెదేపా నాయకులు కంచర్ల శివరామయ్య, దామచర్ల శ్రీనివాసరావు, నాయుడు ఓంకార్, షేక్ మీరావలి, షేక్ చినబాజి, గుడిమెట్ల దయారత్నం, ధూళిపాళ్ల ఏసుబాబు, తలతోటి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!
-
Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్‌లలో సరికొత్త ఫీచర్లు
-
Video: పరిణీతి-రాఘవ్ పెళ్లి సంగీత్.. సీఎంలు కేజ్రీవాల్, మాన్ సందడి