logo

చీరాలలో చీకట్లు

చీరాల ప్రాంతం సాయంత్రం.. 4 గంటల సమయం.. మొదట చల్లని గాలి.. ఆపై ఒక్క సారిగా ఈదురుగాలి, సుడిగాలి.. భారీ వర్షం.. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే బీభత్సం.. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో చీరాల ప్రాంతంలో ఎక్కువ చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయి గాఢాంధకారం నెలకొంది.

Published : 02 Jun 2023 05:16 IST

ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్తు సరఫరా

ఒక ఇంటిపై కూలిన వృక్షం

చీరాల గ్రామీణం, చీరాల పట్టణం, న్యూస్‌టుడే: చీరాల ప్రాంతం సాయంత్రం.. 4 గంటల సమయం.. మొదట చల్లని గాలి.. ఆపై ఒక్క సారిగా ఈదురుగాలి, సుడిగాలి.. భారీ వర్షం.. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే బీభత్సం.. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో చీరాల ప్రాంతంలో ఎక్కువ చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయి గాఢాంధకారం నెలకొంది. ఐఎల్‌టీడీ కంపెనీ, పేరాల, ఈపూరుపాలెం, బుర్లవారిపాలెం, సాయికాలనీ, తోటవారిపాలెం, గవినివారిపాలెం, వైకుంఠపురం, విఠల్‌నగర్‌, రైల్వే స్టేషన్‌, ముంతావారి కూడలి, దండుబాట, ఉడ్‌నగర్‌, యాదవపాలెం తదితర చోట్ల స్తంభాలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల చెట్లు నేలకూలడంతో తీగలు దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాలలో విద్యుత్తు పునరుద్ధరణకు సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం నాటికి పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చీరాల-బాపట్ల మధ్య ఈపూరుపాలెం వద్ద ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాయికాలనీలో స్తంభాలు ఒరిగాయి. పంచాయతీ అధికారులు అప్రమత్తమై రహదారులకు అడ్డుగా ఉన్న చెట్లను పొక్లెయిన్‌ సాయంతో తొలగించారు.

చీరాల - బాపట్ల ప్రధాన రహదారిలో నేలవాలిన చెట్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని