32 మంది ఉద్యోగులపై చర్యలకు ఆదేశం
గుంటూరు నగరపాలక ప్రణాళిక, రెవెన్యూ విబాగాల్లో పనిచేసే 32 మంది ఉద్యోగులపై అనిశా నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది.
అనిశా ఆకస్మిక తనిఖీల పర్యవసానం
పొరుగు సేవల ఉద్యోగి తొలగింపు
ఈనాడు-అమరావతి: గుంటూరు నగరపాలక ప్రణాళిక, రెవెన్యూ విబాగాల్లో పనిచేసే 32 మంది ఉద్యోగులపై అనిశా నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. బాధ్యులైన ఉద్యోగులపై అనిశా నివేదికను అనుసరించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి నగర కమిషనర్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలు శనివారం నగరపాలకకు అందాయి. ఈపరిణామంతో సంబంధిత ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. ఉదయాన్నే ఈ ఆదేశాలు రావడంతో విధులకు హాజరైన కొందరు అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా డీలాపడ్డారు. భవిష్యత్‌లో తమకు ఉద్యోగోన్నతులకు ఈ చర్యలు అడ్డుగా ఉంటాయని ఆందోళన చెందారు.
అసలేం జరిగింది... : 2020 ఫిబ్రవరి 18న ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో ఏసీబీ ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వారి తనిఖీల్లో పలువురు ఉద్యోగుల వద్ద పరిమితికి మించి నగదు పట్టుబడింది. అప్పట్లో రెవెన్యూ విభాగంలో ఓ ఉద్యోగి స్కూటర్ డిక్కీలో రూ.60 వేలు చిక్కింది. ప్రణాళికలో పొరుగుసేవల ఉద్యోగి వద్ద రూ.29,093 స్వాధీనం చేసుకున్నారు. పొరుగుసేవల ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని అనిశా నివేదికలో స్పష్టంగా పేర్కొనటంతో ఆ ఉద్యోగిని శనివారం విధులకు హాజరైనా విషయం చెప్పి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ రెండు విభాగాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులపై అవినీతి, అక్రమాలు నిర్ధారణ కావటం.. అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని అనిశా ప్రభుత్వానికి నివేదించింది.
సొంత లబ్ధి చూసుకున్నారనే... : నగరంలో 20 భవనాలకు వెళ్లి పరిశీలించగా వాటిల్లో ఏ ఒక్క భవనానికి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే వాటిని ఎందుకు అడ్డుకోలేదు? రెవెన్యూ అధికారులు వాటికి నూరు శాతం అపరాధ రుసుం విధించి ఆస్తి పన్ను వేశారు. దాన్ని అనుసరించి కనీసం ఆ భవనాలను బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీంలో పెట్టి అనుమతులు తీసుకునేలా చేయటంలో ప్రణాళికాధికారులు వైఫల్యం చెందారనీ.. దీని వెనక వారు సొంత లబ్ధి చూసుకున్నారని అనిశా అధికారులు అనుమానించి వారి వివరణలు నమోదు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తాము పరిశీలించిన 20 భవనాల్లో ఏ ఒక్కదానికి అనుమతులు లేకుండా నిర్మించటంతో నగరపాలక ఆదాయానికి ఆదాయం రాకుండా నష్టపోయేలా వ్యవహరించారని గుర్తించారు.
ఉద్యోగుల కలవరం... : నిబంధనలు అనుసరించి వాటికి అపరాధ రుసుములు విధించటమో, కూల్చటమో చేయాలి. మొక్కుబడిగా కొన్ని భవనాల్ని కూల్చారు. ఆతర్వాత మిగిలిన వాటిని పట్టించుకోలేదు. దీంతో మరోసారి ఆ భవనాల పరిశీలనకు వెళ్లిన అనిశా యంత్రాంగం కొన్ని భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుసుకుంది. ఏసీపీ, డీసీపీ వంటి అధికారులు నిర్లక్ష్యం వహించారనీ.. వారూ దీనికి బాధ్యులేనని చర్యలకు సిఫార్సులు చేసింది. అనిశా డీజీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 18న నివేదిక వెళ్లటం దాన్ని అనుసరించి తాజాగా చర్యలకు ఆదేశించటంతో ఉద్యోగులు వణుకుతున్నారు. ప్రస్తుతం నగరపాలక ఇన్‌ఛార్జి కమిషనర్‌గా పురపాలకశాఖ కమిషనర్ కోటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారి కావటంతో తమపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని బాధ్యులైన ఉద్యోగులు హడలిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా