నాలుగేళ్లు.. ఆరుగురు సహాయ కమిషనర్లు
నాలుగేళ్ల కాలంలో శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయానికి ఆరుగురు సహాయ కమిషనర్‌లు మారారు.
చర్చనీయాంశంగా ప్రసన్నాంజనేయస్వామి ఆలయ ఈవోల బదిలీలు
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం
శింగరకొండ(అద్దంకి): నాలుగేళ్ల కాలంలో శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయానికి ఆరుగురు సహాయ కమిషనర్‌లు మారారు. బాపట్ల జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి గుడి ఒకటి. దినదిన ప్రవర్థమానంగా వృద్ధి చెందుతున్న ఆలయాభివృద్ధిపై సంపూర్ణ దృష్టి సారించేందుకు అధికారులకు అవకాశం లేకుండా పోయింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కేబీ.శ్రీనివాసరావు ఈవోగా పనిచేశారు. అనంతరం ఎం.తిమ్మానాయుడు, నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, గ్రంధి మాధవి, ఎస్.రఘునాథరెడ్డి, టి.సుభద్ర పనిచేశారు. తాజాగా టి.సుభద్రను బదిలీ చేసి తిరిగి ఎస్.రఘునాథరెడ్డిని నియమించారు. ప్రస్తుతం గుడి వద్ద తితిదే సహకారంతో రూ.6 కోట్లతో ముఖమండపం పునర్నిర్మాణ పనులు చేపట్టారు. భక్తుల విశ్రాంతశాల, గోశాల, అన్నదాన మండపం, పోటుభవనం నిర్మాణం పూర్తయింది. కార్యాలయ భవనం పనులు జరుగుతున్నాయి. మారుతీ భవన్ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఓవైపు పనులు జరుగుతుండగా.. మరోవైపు అధికారుల బదిలీలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో పనిచేసిన అధికారుల్ని ఏడెనిమిది నెలలకే బదిలీలు చేయడంపై భక్తులు, ఆలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్