logo

వేతన బకాయిలు చెల్లించాల్సిందే

సహకార సంఘాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 2019 నుంచి ఉన్న వేతన బకాయిలను చెల్లించాలని, జీవో 36ను వెంటనే అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు.

Published : 06 Jun 2023 05:14 IST

సమావేశంలో సంఘ సభ్యులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సహకార సంఘాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 2019 నుంచి ఉన్న వేతన బకాయిలను చెల్లించాలని, జీవో 36ను వెంటనే అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం బ్రాడీపేటలోని సహకార భవన్‌లో సంఘ సభ్యులు సమావేశమయ్యారు. డీసీసీబీ ఉద్యోగుల మాదిరిగా పీఏసీఎస్‌ ఉద్యోగులకు సమాన డీఏ చెల్లించాలని, సంఘాల్లో పని చేస్తున్న సిబ్బందికి గ్రాట్యూటీ జీవో 36 ప్రకారం రూ.2 లక్షలను రూ.10 లక్షలకు పెంపుదల చేయాలని కోరారు. అదేవిధంగా పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సంఘాల్లో పని చేస్తున్న వారికి బదిలీలు చేపట్టడం శుభపరిణామమని, జీతభత్యాలను సంఘ లాభనష్టాలతో సంబంధం లేకుండా డీఎల్‌ఈసీ కమిటీ వారు కేడర్‌ ఫండ్‌ ద్వారా చెల్లించాలని తదితర మొత్తం 15 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి మొవ్వా వెంకటేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని