logo

మోదీ పాలనలో దేశం అభివృద్ధి’

స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల్లో అభివృద్ధి చెందని భారత్‌ కేవలం మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లలో ప్రపంచ స్థాయి అభివృద్ధిని చేసి చూపించారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్పవార్‌ తెలిపారు.

Published : 06 Jun 2023 05:14 IST

మాట్లాడుతున్న భారతీ ప్రవీణ్పవార్‌, పక్కన రామకృష్ణ తదితరులు

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల్లో అభివృద్ధి చెందని భారత్‌ కేవలం మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లలో ప్రపంచ స్థాయి అభివృద్ధిని చేసి చూపించారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్పవార్‌ తెలిపారు. గుంటూరు లాలుపురం రోడ్డులోని భాజపా జిల్లా కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ స్వశక్తి కరణ్ అభియాన్‌, బూత్‌ కమిటీ, జిల్లా సోషల్‌ మీడియా సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశానికి భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భారతీ ప్రవీణ్‌ పవార్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తారని, ఒడిశా పర్యటనే అందుకు నిదర్శనమన్నారు. ఏపీ అభివృద్ధికి ఇప్పటికే రూ.10 వేల కోట్లు అందజేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులు పరిశీలించడానికి ఇకపై తరచుగా రాష్ట్రానికి వస్తానన్నారు. గుంటూరులో వ్యాపారవేత్తలతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ వాతావరణం తమకెంతో ఉపయోగకరంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారన్నారు.   పీఎం అవాస్‌ యోజన్‌ కింద మూడు కోట్ల మందికి పైగా గృహాలు అందాయన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 11 కోట్ల కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యసాయం అందిస్తామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో తనిఖీలు చేస్తామన్నారు. పీఎం వికాస్‌ యోజన ద్వారా యువజనులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో ప్రవాస్‌ యోజన రాష్ట్ర కన్వీనర్‌ పాకా సత్యనారాయణ, కో-కన్వీనర్‌ మాగంటి సుధాకర్‌యాదవ్‌, భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, జిల్లా ఇన్‌ఛార్జి నీలకంఠ, భాజపా పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోట రామకృష్ణ, నాయకులు భీమినేని చంద్రశేఖర్‌, పాలపాటి రవికుమార్‌, శివ, టీవీరావు, రాజేష్‌, కుమార్‌గౌడ్‌, రంగా, వనమా నరేంద్ర, అన్ని మండలాల నాయకులు, ఇన్‌ఛార్జులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని