ఆయుర్వేదం.. ఆరోగ్యప్రదం
ఆయుర్వేద చిట్కాలతో ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల సహాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ చెబుతున్నారు.
ఆయుర్వేద చిట్కాలతో ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల సహాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ చెబుతున్నారు.
* వేసవి కారణంగా అవసరమైన పోషకాలు శరీరం నుంచి బయటకు పోతుంటాయి. దీంతో నీరసం ఆవహిస్తోంది. నివారణకు మజ్జిగలో ఉప్పు కలిపి పుదీనా, కొత్తిమీర ఆకులను వేసుకొని తాగితే కోల్పోయిన పోషకాలు తిరిగి భర్తీ అవుతాయి. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవచ్చు. ఈ కాలంలో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతుంటాయి. ఎసిడిటీ ఉంటే లవంగ ముక్కని చప్పరించడంతో ఇబ్బంది తగ్గుతుంది.
* చెమట, వేడి వల్ల కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. గాలి ఆడని ప్రాంతాల్లో చర్మం నల్లగా మారుతుంది. తురిమిన దోసకాయను మెడ, ముఖం, కళ్లపై రాసుకుంటే చల్లగా ఉండటమే కాకుండా మొటిమలు, నల్లమచ్చలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
* అధిక మసాలాలు, మాంసాహారం తీసుకుంటే ఉబ్బరం, కడుపులో మంట, అల్సర్ల లాంటి సమస్యలు వేధిస్తాయి. రోజూ కొన్ని తులసి ఆకులు తీసుకొని నమిలి మింగితే ఈ సమస్య తగ్గుతుంది.
* అధిక వేడి వల్ల చాలామందికి మూత్రం రాదు. ఒకవేళ వచ్చినా.. ముదురు పసుపుపచ్చ రంగులో ఉంటుంది. మంటగా అనిపిస్తుంది. గ్లాసు నీళ్లలో కొంచెం ధనియాల పొడి వేసి కాచిన తర్వాత చల్లార్చి తాగాలి. మంట తగ్గుతుంది.
* సబ్జా గింజలు నీటిలో కలిపి తీసుకుంటే శరీరం ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి.
* చందనాది వటి, చందనాసవం, ఉశీరాసవం చూర్ణాల్లో ఏదైనా ఒక దానిని గ్లాసు నీళ్లల్లో చెంచా కలుపుకొని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి. ఎండదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. మిశ్రి(కండశ్కర) నీళ్లలో కలిపి తాగినా శరీరానికి చలువ చేస్తుంది. షడంగ పానీయ చూర్ణంతో కషాయం తయారు చేసుకొని తాగడం వల్ల అనారోగ్య ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
-
Chandrababu Arrest: ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్రెడ్డి
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్