logo

ట్రాక్టర్‌ ప్రమాదం.. యజమాని, డ్రైవర్‌పై కేసు

వట్టిచెరుకూరు సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనపై గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ మహ్మద్‌ బాషా మంగళవారం విచారణ నిర్వహించారు.

Published : 07 Jun 2023 04:32 IST

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సౌత్‌ జోన్‌ డీఎస్పీ మహ్మద్‌ బాషా, తహసీల్దారు కోమటినేని నాసరయ్య, అధికారులు

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనపై గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ మహ్మద్‌ బాషా మంగళవారం విచారణ నిర్వహించారు. లింగంగుంటపాలెం దారిలో కుడి వైపు కాలువలో ట్రాక్టర్‌ పడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై డ్రైవర్‌ కుల్లి ప్రశాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద స్థలానికి అతిచేరువలో ఉన్న పెట్రోల్‌ బంకులో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. ట్రాక్టర్‌ యజమాని జొన్నకూటి శామ్యేల్‌ను విచారించారు. వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు పరిశీలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే ట్రాక్టర్‌ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు. ఎస్సై కలగయ్య సమక్షంలో కాలువలో పడిన ట్రాక్టర్‌ను పొక్లెయిన్‌ సహాయంతో బయటకు తీశారు.

ఏడుగురి మృతిపై ప్రభుత్వానికి నివేదిక : ట్రాక్టర్‌ బోల్తాపడిన దుర్ఘటనపై తహసీల్దారు కోమటినేని నాసరయ్య ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మృతి చెందిన ప్రత్తిపాడు మండలం కొండేపాడుకు చెందిన మిక్కిలి నాగమ్మ(54), గనికపూడి సుహాసిని(36), గనికపూడి మేరిమ్మ(43), గనికపూడి రత్నకుమారి(57), కట్టా నిర్మల(59), మామిడి జాన్సీరాణి(35), గనికపూడి సలోమి(39)లతో పాటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న మరో 18 మంది క్షతగాత్రుల వివరాలు తెలియజేసినట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని