logo

పాఠశాలలు తెరిచే నాటికి కానుక కష్టమే

వచ్చే(2023- 24) విద్యాసంవత్సరం ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉంది.. పాఠశాలల ప్రారంభంలోగా పాఠ్యపుస్తకాలతోపాటు జగనన్న విద్యాకానుక వస్తువులు సకాలంలో అందజేయడం కష్టమే అనిపిస్తోంది.

Published : 07 Jun 2023 04:32 IST

ఎనిమిది వస్తువుల్లో మూడే పూర్తిగా రాక  
గుంటూరు విద్య, న్యూస్‌టుడే

జగనన్న విద్యాకానుక వస్తువులు

వచ్చే(2023- 24) విద్యాసంవత్సరం ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉంది.. పాఠశాలల ప్రారంభంలోగా పాఠ్యపుస్తకాలతోపాటు జగనన్న విద్యాకానుక వస్తువులు సకాలంలో అందజేయడం కష్టమే అనిపిస్తోంది. జేవీకే కిట్‌లు సకాలంలో అందజేసేందుకు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు రెండు నెలలుగా సమీక్షలు చేస్తూనే ఉన్నారు. కిట్‌లో బ్యాగ్‌తోపాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బ్యాగ్‌, బూట్లు, బెల్టులు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, బొమ్మల డిక్షనరీలు అందించాల్సి ఉంది. వాటిలో ఏకరూప దుస్తులు, డిక్షనరీలు మినహా మిగిలిన వస్తువుల రాకలో జాప్యం జరుగుతోంది. ఈఏడాది కూడా పాఠశాలలు ప్రారంభమైన తర్వాతే జేవీకే కిట్‌లు అందజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జిల్లాలో మొత్తం  1095 పాఠశాలలు ఉండగా, 1,16,430 మంది విద్యార్థులకు జేవీకే కిట్‌లు చేరవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని