పరిష్కారాలు పల్టీ కొట్టాయి
వెలగని వీధి దీపాలు.. పొంగి పొర్లుతున్న మురుగు కాలువలు.. గతుకుల దారులు.. కుక్కల బెడద.. పందుల సంచారం..
ఫిర్యాదులపై అధికారులకు తప్పుడు నివేదికలు
క్షేత్ర స్థాయి పరిస్థితులకు విరుద్ధంగా గణాంకాలు
న్యూస్‌టుడే, పొన్నూరు, మంగళగిరి: వెలగని వీధి దీపాలు.. పొంగి పొర్లుతున్న మురుగు కాలువలు.. గతుకుల దారులు.. కుక్కల బెడద.. పందుల సంచారం.. ఇవీ పట్టణ, నగర ప్రాంతాల్లో వివిధ రకాల సమస్యలు.. వీటిపై ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జనం నుంచి వినతులు వెల్లువెత్తుతుంటాయి. ఇవికాక పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చేవి మరికొన్ని.. ఇలా వచ్చే ప్రతి సమస్యను డీఎంఏ (డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు నమోదు చేసుకుంటారు. వీటిని స్థానిక యంత్రాంగానికి పంపి వివరణ కోరతారు. ఇంతవరకు వ్యవస్థ బాగానే ఉన్నా ఆ సమస్యల పరిష్కారంలోనే డొల్లతనం కనిపిస్తోంది. ఇందులో కొన్ని సమస్యలకు వీలైనంత త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు. నివేదికలు పంపిన తర్వాత నిధులు లేవనే కారణంతో వాటిని పరిష్కరించడం లేదు. కొన్ని పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చెబుతున్నారు. చూడడానికి ఇబ్బందులు చిన్నవే అనిపించినా దగ్గరగా ఉండి అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుంది. ఎంతో ప్రయాసకోర్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చివరకు పరిష్కరించామని నమోదు చేసి వదిలేస్తుండడంతో సమస్య మొదటికొస్తోంది.
ఉదాహరణలు కొన్ని...
మహిళల మరుగుదొడ్డికి తలుపులు లేని తీరిది..
* పొన్నూరు పట్టణం 4వ వార్డు కొప్పాక వెంకయ్య కూరగాయల మార్కెట్ సెంటర్‌లో పురపాలక సంఘం అధికారులు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు మలమూత్రశాలను అందుబాటులో ఉంచారు. మహిళలు ఉపయోగించే మరుగుదొడ్లకు తలుపులు లేవని గతేడాది డిసెంబరు 26న ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనిపై డీఎంఏ(డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు స్థానిక మున్సిపల్ యంత్రాంగాన్ని వివరణ కోరారు. ఇందుకు పురపాలక సంఘం అధికారులు మూడు రోజుల్లోపే ఆ మరుగుదొడ్లకు తలుపులు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. నాటి నుంచి నేటి వరకు ఆ మరుగుదొడ్డికి తలుపులు ఏర్పాటు చేయకపోగా సమస్య పరిష్కరించినట్లు చూపారు.
2022 డిసెంబర్ 12న మూడు రోజుల్లో తలుపులు ఏర్పాటు చేస్తామని డీఎంఏకు పంపిన నివేదిక
జిల్లాలో గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌తో పాటు పొన్నూరు, తెనాలి పురపాలక సంఘాలు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 10,594 ఫిర్యాదులు రాగా అందులో 10,337 పరిష్కరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అందులో పందుల సంచారంపై 1310 ఫిర్యాదులు రాగా 1242, కుక్కల బెడదపై 965 ఫిర్యాదులు రాగా 955 పరిష్కారమైనట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో జనం గోడు పట్టించుకునేవారు లేకుండా పోయారు. నిధుల లభ్యతను బట్టి పనులు చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. పొన్నూరు పురపాలక సంఘంలో 530 ఫిర్యాదులు రాగా అన్నీ పరిష్కరించేశామని పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘంలో 494 ఫిర్యాదులకు 493 పరిష్కరించినట్లు వెబ్‌సైట్‌లో గణాంకాలు పొందుపర్చారు. క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు గణాంకాలు విరుద్ధంగా ఉన్నాయి.
పొన్నూరు పట్టణం 12వ వార్డు వడ్డిముక్కల రోడ్డులో సైడుబరమ్స్ లేక ప్రమాదకరంగా ఇలా..
* పొన్నూరు పట్టణం 12వ వార్డు వడ్డిముక్కల రోడ్డులో నిర్మించిన రహదారికి సైడుబరమ్స్ ఏర్పాటు చేయలేదు. ప్రమాదం పొంచి ఉందని గత ఏడాది ఆగస్టు 18న ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఇందుకు అధికారులు సైడుబరమ్స్ ఏర్పాటు చేసేందుకు అంచనాలు తయారు చేశామని, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వీలైనంత త్వరితగతిన పనులు చేస్తామని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. నాటి నుంచి నేటి వరకు రహదారికి సైడుబరమ్స్ ఏర్పాటు చేయలేదు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలోని నులకపేట నుంచి బ్రహ్మానందపురానికి వెళ్లే మార్గం ఇప్పటికీ గోతులమయమే..
*తాడేపల్లి పరిధిలోని నులకపేట నుంచి బ్రహ్మానందపురానికి వెళ్లే మార్గం చిందరగా మారింది. ఆ రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. వాహనదారులు రాకపోకలు నిర్వహించే సమయంలో ఇబ్బందులు పడుతున్నారని ఈ ఏడాది జనవరి 19న ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఇందుకు అధికారులు స్పందించి తాత్కాలికంగా గోతులను పూడ్చారు. మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఆ సమస్య పరిష్కరించినట్లు అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం
-
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్