వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపునకు డిమాండ్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉన్నందున వెబ్ ఆప్షన్‌లో నమోదు గడువు పొడిగించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు గేరా మోహనరావు డిమాండ్‌చేశారు.
మాట్లాడుతున్న గేరా మోహనరావు
గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉన్నందున వెబ్ ఆప్షన్‌లో నమోదు గడువు పొడిగించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు గేరా మోహనరావు డిమాండ్‌చేశారు. బుధవారం కంకరగుంట గేటు వద్దనున్న సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు తప్పులతడకగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పోస్టులు బ్లాక్ చేయడంతో తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారన్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేపట్టాలని కోరారు. సీనియార్టీ జాబితా పాయింట్ల నమోదు, పని సర్దుబాటు పాయింట్లు, ప్రాధాన్యత క్రమాలు, ప్రత్యేక పాయింట్లు వీటిన్నింటికి స్పష్టమైన నిబంధనలు తెలియజేయకుండా, అధికారులు ఎవరికి తోచినట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తక్షణం సీనియార్టీ జాబితాలు పరిశీలించి లోపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందా నరసింహరావు, రాష్ట్ర మహిళా కన్వీనర్ ఉమా, జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ బాజీ, జిల్లా ఉపాధ్యక్షులు పేరేచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.