logo

బడి గంటకు వేళైనా... బాగుపడని భవనాలు

మంగళగిరి పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు ప్రారంభమై ఏడాది కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.

Published : 08 Jun 2023 04:39 IST

మంగళగిరి పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు ప్రారంభమై ఏడాది కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. తరగతి గదుల్లో సిమెంటు బస్తాలు నిల్వ చేసి, వరండాల్లో ఇసుక, కంకర, ఇనుప చువ్వలు అడ్డదిడ్డంగా పడేసి ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో అరకొరగా అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగితే, మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఇంకొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం గోడల దశలోనే ఉన్నాయి. నిడమర్రు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిన్నపాటి వర్షానికే మోకాలి లోతు నీరు చేరుతోంది. దీని కోసం ఆవరణ కంటే ఎత్తులో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి పైకప్పు వరకు వేశారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. పాఠశాలలు మొదలైతే పాడుబడిన మరుగుదొడ్లనే ఉపయోగించికోవాల్సిన పరిస్థితి. నవులూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరు అదనపు గదులతో పాటు, జూనియర్‌ కళాశాల భవనం నిర్మించాల్సి ఉంది. ఇప్పటికీ ఆరు గదుల నిర్మాణం గోడల దశలోనే ఉంది. జూనియర్‌ కళాశాల భవనం ఇంకా పునాదులే వేయలేదు. కొన్ని రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో గతేడాది విద్యార్థులు పడ్డ అవస్థలే ఈ ఏడాదీ తప్పేలా లేవు.

 ఈనాడు, అమరావతి


నవులూరు


గోడల దశలోనే జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6 అదనపు తరగతి గదుల నిర్మాణం


మంగళగిరి

మంగళగిరి అప్పర్‌ప్రైమరీ స్కూలులో అదనపు తరగతి గదులు నిర్మాణ దశలోనే  


నిడమర్రు

ఎంపీపీ స్కూలు ఆవరణలో నిర్మాణ దశలోనే నిలిచిపోయిన మరుగుదొడ్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని