ఉద్యమ నాయకులపై కేసులు అన్యాయం
అమరావతి కోసం పోరాడుతున్న ఉద్యమ నాయకులను కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం అన్యాయమని తెదేపా అనంతపురం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్దండరాయునిపాలెం శిబిరంలో నినాదాలు చేస్తున్న అనంతపురం తెదేపా నాయకులు, రైతులు
తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతి కోసం పోరాడుతున్న ఉద్యమ నాయకులను కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం అన్యాయమని తెదేపా అనంతపురం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు బుధవారానికి 1,268వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉద్దండరాయునిపాలెం దీక్ష శిబిరాన్ని అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు రాజేంద్ర, మదిగుబ్బ గ్రామ కమిటీ తెదేపా నాయకులు నరసింహులు తదితరులు సందర్శించి రైతు దీక్షలకు మద్దతు తెలిపారు. అమరావతి విషయంలో న్యాయమడిగితే కేసులు పెట్టడం అన్యామన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. అమరావతి దళిత ఐకాస నాయకుడు పులి చిన్నాపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించటం దారుణమన్నారు. 2024లో వైకాపా పాలన అంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా