logo

‘రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు రక్షణ ఏదీ?’

రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు గుడిమెట్ల దయారత్నం విమర్శించారు.

Updated : 08 Jun 2023 06:06 IST

తెదేపా ఎస్సీ సెల్‌ నాయకుల నిరసన

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు గుడిమెట్ల దయారత్నం విమర్శించారు. వైకాపా గూండాలు దళిత మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హత్య చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ లాడ్జి సెంటర్‌లో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దయారత్నం మాట్లాడుతూ తెదేపా దళిత కార్యకర్త సుధాకర్‌ భార్య హనుమాయమ్మను వైకాపా నాయకుడు కొండలరావు ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం జగన్‌ రెడ్డి రాక్షస పాలనకు నిదర్శనం. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. దళితులపై నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళితుల ఓట్లతో గద్దెనెక్కి వారి పైనే దాడులు చేయిస్తున్నారు. కొండలరావును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తెదేపా ఎస్సీ సెల్‌ నాయకులు బొల్లెద్దు సుశీలరావు, దాసరి రమణ, సౌపాటి రత్నం, లింగంగుంట్ల ఆదాం, దర్ననపు యాకోబు, అనిల్‌కుమార్‌, ఆనంద్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని