‘ఒప్పంద ఉద్యోగులను మోసం చేసిన సీఎం జగన్’
పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న మున్సిపల్, సీఐటీయూ నేతలు
వినుకొండ, నరసరావుపేటలీగల్, న్యూస్‌టుడే: పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆ సంఘం చేపట్టిన ప్రచారయాత్ర బుధవారం వినుకొండకు చేరింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా 2019 ఎన్నికలకు ముందు జగన్ ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. ప్రచారజాత బుధవారం నరసరావుపేటకు చేరుకున్న సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన సభలో నాగభూషణం మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల, మాచర్ల, నరసరావుపేట మున్సిపల్ కార్మికులు సమస్యలతో కూడిన వినతి పత్రాలను రాష్ట్ర అధ్యక్షులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేంద్రబాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిలార్ మసూద్, నాగరాజు, ప్రజా నాట్యమండలి కళాకారులు కృష్ణవేణి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’