logo

‘జగన్‌ సంక్షేమ పథకాలన్నీ మోసపూరితమే

తెదేపా మొదటి విడత ఎన్నికల ప్రణాళిక ట్రైలర్‌ మాత్రమే, విజయదశమికి చంద్రబాబు ప్రవేశపెట్టే పూర్తి స్థాయి ఎన్నికల ప్రణాళిక సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 09 Jun 2023 06:02 IST

మాట్లాడుతున్న తెనాలి శ్రావణ్‌కుమార్‌, వేదికపై నాయకులు

పట్టాభిపురం (గుôటూరు), న్యూస్‌టుడే: తెదేపా మొదటి విడత ఎన్నికల ప్రణాళిక ట్రైలర్‌ మాత్రమే, విజయదశమికి చంద్రబాబు ప్రవేశపెట్టే పూర్తి స్థాయి ఎన్నికల ప్రణాళిక సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో భవిష్యత్తుకు గ్యారంటీపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జగన్‌ నవరత్నాల పేరిట అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మోసపూరితమే. అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ నిబంధనల పేరుతో అర్హులకు పథకాలు దూరం చేస్తున్నారు. జగన్‌ పాలనలో గంజాయి మాత్రం ఎక్కడ చూసినా దొరుకుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయడం తెదేపాకే సాధ్యం. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక అద్భుతం. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ.1500 ఆర్థిక సాయం. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కోసం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా రూ.15,000 ప్రోత్సాహం. దీపం పథకం ద్వారా ప్రతి మహిళకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. బీసీలకు రక్షణ చట్టం. నిరుద్యోగ యువతకు రూ.3,000 నిరుద్యోగ భృతి. అన్నదాతకు ఏడాదికి రూ.20,000 ఆర్థిక సహాయం వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపాలంటే ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పని చేస్తూ ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’.. అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు దామినేని శ్రీనివాసరావు, కంచర్ల శివరామయ్య, నూతలపాటి రామారావు, గుంటుపల్లి మధుసూదనరావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, నార్నె శ్రీనివాసరావు, ఇత్తడి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని