తీరాన గాలివాన బీభత్సం
డెల్టాలోని వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో శుక్రవారం గాలీవాన బీభత్సంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి.
నేలకొరిగిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు
వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో నిలిచిన సరఫరా
తెనాలి వెల్లటూరు రహదారిపై కూలిన చెట్టు
న్యూస్‌టుడే-వేమూరు, రేపల్లె అర్బన్, కొల్లూరు, చెరుకుపల్లి గ్రామీణ: డెల్టాలోని వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో శుక్రవారం గాలీవాన బీభత్సంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి సరఫరాకు అంతరాయం కలగగా కొన్నిచోట్ల రాత్రి 9 గంటలకు పునరుద్ధరించారు. 33కేవీ విద్యుత్తు లైన్లపై భారీ వృక్షాలు పడటంతో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కష్టంగా మారింది. కొన్ని గ్రామాలకు శనివారం ఉదయం తర్వాతే సరఫరా పునరుద్ధరించే పరిస్థితి ఉంది. శుక్రవారం ఉదయం నుంచి సూరీడు ఎండతో ప్రతాపం చూపగా సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వేమూరుకు తెనాలి, కొల్లిపర మండలం చక్రాయపాలెం నుంచి 33 కేవీ విద్యుత్తు తీగల ద్వారా సరఫరా ఇస్తున్నారు. ఈ రెండు లైన్లు దెబ్బతినడంతో వేమూరుకు సరఫరా నిలిచిపోయింది. వేమూరు నుంచి కొల్లూరుకు సరఫరా ఉన్నందున అక్కడ అంధకారం నెలకొంది. అమర్తలూరు, భట్టిప్రోలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేమూరు మండలంలో తెనాలి-వెల్లటూరు మార్గంలో జంపని నుంచి ముసలిపాడు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నచోట్ల విరిగి రోడ్డుపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. బలమైన గాలులకు చక్రాయపాలెం నుంచి వేమూరుకు వచ్చే 33కేవీ విద్యుత్తు లైనులో మూడు స్తంభాలు, స్తంభాల కూడలి నిర్మాణం కూలిపోయింది. తెనాలి నుంచి వేమూరు వచ్చే 33కేవీ లైను రెండుచోట్ల ఇన్సులేటర్లు పగిలిపోయి సరఫరాకు అంతరాయం కలిగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో 25 స్తంభాలు నేలకొరిగాయి. ఈ కారణంగా కొల్లూరు, అమర్తలూరు మండలాలకు కూడా వేమూరు నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
రేపల్లె పట్టణం, మండలంలో శుక్రవారం సాయంత్రం 5గంటల తర్వాత చల్లని గాలి.. ఆపై కొంతసేపటికి ఈదురుగాలి, సుడిగాలితో వర్షం కురిసింది. అరగంట వ్యవధిలో బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు కూలి రహదారులు, ఇళ్లపై పడ్డాయి. పేటేరు, పెనుమూడి, కామరాజుగడ్డ, నల్లూరు, మోర్తోట గ్రామాల్లో ఎక్కువగా విద్యుత్తు స్తంభాలు నెలకొరిగి తీగలు తెగిపడ్డాయి. పట్టణంలో విద్యుతు సరఫరా పునరుద్ధరణకు డీఈ భాస్కరరావు, ఏఈ ఏడుకొండలు, సిబ్బందితో కలసి పని చేస్తున్నారు. చెరుకుపల్లి చుట్టుపక్కల మండలాల్లో శుక్రవారం ఈదురుగాలుల బీభత్సానికి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8గంటల వరకు సరఫరా నిలిచింది. చెరుకుపల్లికి వచ్చే విద్యుతు ప్రధాన లైన్లపై పలు చోట్ల చెట్లు కూలడంతో విద్యుతు సరఫరా నిలిచిందని ఏఈ బాషా తెలిపారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్తుశాఖ సిబ్బంది రాత్రివేళ కూడా సరఫరా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో అంధకారం నెలకొనడంతో ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటకొస్తే దోమల మోతతో అల్లాడిపోతున్నారు. ఈ రాత్రికి జాగారమేనని పల్లె వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!
-
JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్ చేరికకు రంగం సిద్ధం?
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!