logo

వస్త్ర నిల్వల నష్టంపై విచారణ

భట్టిప్రోలు చేనేత సహకార సంఘంలో వస్త్ర నిల్వలు, చిలపనూలు దెబ్బతిని మూడేళ్ల క్రితం సుమారు రూ.6.50 లక్షలు నష్టం వాటిల్లిన వైనంపై జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ వనజ సొసైటీ సభ్యులను విచారించారు.

Published : 10 Jun 2023 05:19 IST

సొసైటీ సభ్యులతో మాట్లాడుతున్న ఏడీ వనజ

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: భట్టిప్రోలు చేనేత సహకార సంఘంలో వస్త్ర నిల్వలు, చిలపనూలు దెబ్బతిని మూడేళ్ల క్రితం సుమారు రూ.6.50 లక్షలు నష్టం వాటిల్లిన వైనంపై జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ వనజ సొసైటీ సభ్యులను విచారించారు. దీనిపై అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న భట్టు నాగమల్లేశ్వరరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సహకార సంఘ మేనేజర్‌గా పనిచేసి ఏడాది క్రితం ఉద్యోగ విరమణ చేసిన వంగర నాగేశ్వరరావు దీనికి కారణమని నివేదిక ఇవ్వడంతో ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలను నిలుపుదల చేశారు. నష్టపోయిన వస్త్రాల వివరాలను ఆయన సక్రమంగా లెక్కచూపలేదని అప్పట్లో ఆరోపించారు. దీనిపై విశ్రాంత మేనేజర్‌ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఏడీగా బాధ్యతలు చేపట్టిన వనజ ఈ అంశానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు వచ్చి సంబంధిత రికార్డులు, పత్రాలను పరిశీలించి నివేదికను తయారు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యను పరిష్కరించే అంశం తమ పరిధిలో లేదని కోర్టులోనే తేలాల్సి ఉందని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కె.పిచ్చియ్యశాస్త్రి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని