రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి
రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
రాష్ట్ర కౌన్సిల్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నబొప్పరాజు వెంకటేశ్వర్లు, సంఘ నాయకులు
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కౌన్సిల్ సన్నాహక సమావేశం గుంటూరులోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం నిర్వహించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు ఒకటి తర్వాత మరొకటి ఇలా వస్తూనే ఉన్నాయని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. కీలకమైన ఎన్నికల ప్రక్రియలో రెవెన్యూ ఉద్యోగులు ఉన్నప్పటికీ రోజువారీ పనులతో పాటు, రీసర్వే, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలతో ఉద్యోగులపై పని భారం పెరుగుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించిన పని ఒత్తిడి ఉందని, వాటిని పరిశీలించేందుకు సమయం సరిపోవడం లేదన్నారు. ఓ జిల్లా కలెక్టర్ వెరిఫికేషన్‌కు సంబంధించి 21 అంశాలు ఇచ్చారని, వాటిని పరిశీలించాలంటే చాలా సమయం పడుతుందన్నారు. రెండేళ్లుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు చెప్పలేనంత పని భారం మోయలేకపోతున్నామన్నారు.. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యే వరకు రెవెన్యూ ఉద్యోగులకు మిగిలిన పనులను చెప్పవద్దని కోరారు. అక్టోబర్ 1వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఉద్యోగులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.కృష్ణమూర్తి, వీఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయకుమార్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు పి.ఎ.కిరణ్‌కుమార్, బాపట్ల జిల్లా అధ్యక్షుడు సీహెచ్.సురేష్, వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం
-
Watch: జుట్టుపట్టుకుని.. కిందపడి తన్నుకుని: లైవ్ డిబేట్లో నేతల కొట్లాట
-
Arvind Kejriwal: కూటమితోనే ఉంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు వివాదం వేళ కేజ్రీవాల్ స్పష్టత
-
Pawan Kalyan: మహేశ్-పవన్‌లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కన్నడ హీరో
-
Nara Brahmani: ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఎందుకు పనిచేస్తున్నారు?: నారా బ్రహ్మణి
-
Komati Reddy: స్పెషల్ ఫ్లైట్ పెడతా.. కర్ణాటక వెళ్దాం రండి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి