logo

అసమానతలపై ఉద్యమమే నిజమైన నివాళి

సమాజంలో నెలకొన్న అసమానతలు, విద్వేషాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే మహాకవి గుర్రం జాషువాకు మనమిచ్చే నిజమైన నివాళి అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు.

Published : 24 Sep 2023 05:43 IST

గోవర్ధన్‌ను సత్కరిస్తున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదు తదితరులు  

గుంటూరు నగరం, సాంస్కృతికం, న్యూస్‌టుడే: సమాజంలో నెలకొన్న అసమానతలు, విద్వేషాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే మహాకవి గుర్రం జాషువాకు మనమిచ్చే నిజమైన నివాళి అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. శనివారం జాషువా కల్చరల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో కార్డ్స్‌ హాలులో జయంతిని ఘనంగా నిర్వహించారు. కల్చరల్‌ సెంటర్‌ గౌరవాధ్యక్షులు బాలస్వామి ఆధ్యక్షత వహించిన వేడుకల్లో ప్రముఖ బౌద్ధ రచయిత, సామాజిక ఉద్యమకారులు బొర్రా గోవర్ధన్‌కు గుర్రం జాషువా సాహితీ పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. అతిథిగా హాజరైన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదు మాట్లాడుతూ జాషువా సాహిత్యం చదవడం, రాయడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు వస్తాయన్నారు. జాషువా, అంబేడ్కర్‌లు విస్తృత అధ్యయనంతో దళిత జాతికి వెలుగునిచ్చారని గుర్తుచేశారు. వీసీకే పార్టీ రాష్ట్ర అద్యక్షులు విద్యాసాగర్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో దళిత వాదాన్ని మహాకవి జాషువా బలంగా వినిపించారని తెలిపారు. విశ్రాంత తెలుగు రీడర్‌ డాక్టర్‌ స్వర్ణలతదేవి, జాషువా కల్చరల్‌ సెంటర్‌ ప్రధాన కార్యదర్శి రమణ, సామాజిక ఉద్యమకారులు బ్రహ్మయ్య తదితరులు మహాకవి సాహిత్యాన్ని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని