logo

అనధికార లేఔట్లపై సీఆర్‌డీఏ కొరడా

ఏపీ సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో రియల్‌ ఎస్టేట్‌ వారు అనధికార లేఔట్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారని, ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

Published : 24 Sep 2023 05:41 IST

ప్లాట్లు అమ్మిన వారిపై చర్యలు

లాం గ్రామ పంచాయతీ పరిధిలో అనధికార లేఔట్‌లో బోర్డు ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ అధికారులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : ఏపీ సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో రియల్‌ ఎస్టేట్‌ వారు అనధికార లేఔట్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారని, ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. అనధికార లేఔట్ల ప్లాట్లు అమ్మడం చట్టరీత్యా నేరమని, ఆ విధంగా చేస్తే శిక్షార్హులని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసి, స్థిరాస్తి వ్యాపారులు ఈ విధంగా చేస్తున్నారని తెలిపారు. ఆయా ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోతారని, చట్టరీత్యా తీసుకునే చర్యలకు బాధ్యులవుతారన్నారు. అనధికార లేఔట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయరు. మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు కలుగుతాయి. అనుమతి పొందిన లేఔట్లలో మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. ఎక్కడైనా అనధికార లేఔట్‌, లేదా అనధికార కట్టడాలు గుర్తిస్తే.. వాట్సాప్‌ నెంబరు 7095599838 (మేసేజ్‌ మాత్రమే), లేదా 0866-2527154 ఫోన్‌ నంబరుకు లేదా సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌ https:/// crda.ap.gov.in/apcrdav2/Views/GrievanceRedressalSystem.aspx కు సమాచారం అందించాలని కమిషనర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని