దృఢ సంకల్పంతో ధ్రువతారగా ఎదిగిన అక్కినేని
దృఢ సంకల్పంతో సినీ వినీలాకాశంలో ధ్రువతారగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వ శిఖరం అక్కినేని నాగేశ్వరరావని పలువురు ప్రముఖులు కీర్తించారు.
నాగేశ్వరరావు శతజయంతి సభలో పలువురు ప్రముఖులు
అక్కినేని-వంద సంవత్సరాలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శారద, రాయుడు, బుర్రా సాయిమాధవ్, మురళి, భువనచంద్ర, తోటకూర ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, దక్షిణామూర్తి, రవి తదితరులు
గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: దృఢ సంకల్పంతో సినీ వినీలాకాశంలో ధ్రువతారగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వ శిఖరం అక్కినేని నాగేశ్వరరావని పలువురు ప్రముఖులు కీర్తించారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అక్కినేని శతజయంతి సభ శనివారం రాత్రి జరిగింది. సభకు తానా పూర్వాధ్యక్షుడు తోటకూర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ తన బలహీనతలను బలాలుగా మార్చుకుని వ్యక్తిత్వ వికాసానికి నిలువుటద్దంగా ఎదిగిన ఆదర్శ మూర్తి అక్కినేని అన్నారు. సభలో ఫౌండేషన్ అధ్యక్షుడు మురళి వెన్నం, కార్యదర్శి రవి కొండబోలు, కమిటీ సభ్యురాలు శారద ఆకునూరి తదితరులు తమ తమ ప్రసంగాలలో అక్కినేని సినీ, జీవిత విశేషాలను, ఆయన అమెరికా వచ్చినప్పటి మధుర జ్ఞాపకాలను, అక్కినేనితో తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి తదితరులు మాట్లాడారు.
పురస్కార ప్రదానోత్సవం: ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు నిర్వాహకులు పురస్కారాలిచ్చి సత్కరించారు. పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామికి జీవన సాఫల్య పురస్కారాన్ని, డాక్టర్ కొండబోలు బసవపున్నయ్యకు వైద్య రత్న పురస్కారాన్ని, విద్యారత్న పురస్కారాలను డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ బులుసు అపర్ణ, పరుచూరి నారాయణాచార్యులు(లల్లాదేవి)లకు ప్రదానం చేశారు. సినీరత్న పురస్కారాలను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, బుర్రా సాయిమాధవ్‌లకు అందజేశారు. సేవారత్న పురస్కారాలను నన్నపనేని సదాశివరావు, డాక్టర్ ఎంవీ రాయుడు, లంక సూర్యనారాయణ, నల్లాని రాజేశ్వరి, సంగీత విద్వాంసుడు స్వర వీణాపాణిలకు ఇచ్చారు. రంగస్థలరత్న పురస్కారాలను కేవీ సత్యనారాయణ, సురభి ప్రభావతి, వ్యాపారరత్న పురస్కారాలను కొత్త సుబ్రహ్మణ్యం, మునగాల మోహన్శ్యామ్ ప్రసాద్, అంబికా రాజాలకు ఇచ్చి సత్కరించారు. వినూత్న రత్న పురస్కారాలను బుర్రా శివ వరప్రసాద్, టి.శ్రీనివాసరెడ్డి, రావర్ల వినోద్ చౌదరి, అక్కినేని అంతర్జాతీయ ప్రత్యేక పురస్కారాలను డోగివర్తి శంకరరావు, పొత్తూరి రంగారావు, మన్నె శ్రీనివాసరావులకు ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా అక్కినేని శతకం, అక్కినేని-100 సంవత్సరాలు పుస్తకాలను అతిథులు, నిర్వాహకులు ఆవిష్కరించారు. చంద్రశేఖర్, వినయ్‌ల నృత్యప్రదర్శన, బాలకామేశ్వరరావు, శాంతిశ్రీ రామకృష్ణ, శారద ఆకునూరి పాడిన పాటలు అలరించాయి. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
SI Exam Results: ఏపీలో ఎస్సై పరీక్ష తుది ఫలితాలు విడుదల
[ 06-12-2023]
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు(SI Exam Results) విడుదలయ్యాయి. -
డ్రైనేజీ కాలువకు గండి.. నీట మునిగిన పంటలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా జిల్లాలోని చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి దక్షిణం వైపున ఉన్న డ్రైనేజీ కాలువకు గండి పడింది. -
ప్రత్తిపాడు నియోజకవర్గంలో నీటమునిగిన పంటలు
[ 06-12-2023]
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొండ వాగు పొంగడంతో నియోజకవర్గంలోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. -
ప్రత్తిపాడులో 163 మి.మీ వర్షపాతం
[ 06-12-2023]
జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు సగటున 99.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. -
పెదనందిపాడులో పరవళ్లు తొక్కుతున్న వాగులు
[ 06-12-2023]
మండలంలోని పొలాల్లో బుధవారం కూడా వర్షపు నీరు నిలిచి ఉంది. పంటలపై ఆశలు వదులుకున్నామని రైతులు వాపోయారు. -
AP High Court: విశాఖకు కార్యాలయాలను తరలించడంపై జీవో.. హైకోర్టులో విచారణ
[ 06-12-2023]
విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. -
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
[ 06-12-2023]
ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. -
TDP: తితిదే బడ్జెట్‌ను వైకాపా ఎలక్షన్ బడ్జెట్‌లా మార్చేశారు: తెదేపా నేత విజయ్‌కుమార్
[ 06-12-2023]
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో(TTD) అదనపు నిధులు లేకుండా, బడ్జెట్ ఆమోదం పొందకుండా ₹1200 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. -
నిర్వాసితులకు పరామర్శ
[ 06-12-2023]
చీరాల మండలం వాడరేవులో మంగళవారం తుపాను బాధితులను కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. సముద్ర తీరంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న దాదాపు వంద మందిని సోమవారం రాత్రి అక్కడ నుంచి తరలించి, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేర్చారు. -
తీరం.. అంధకారం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా వీచిన ఈదురు గాలులకు వందల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడి బాపట్ల జిల్లాలో అంధకారం నెలకొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. భారీ వృక్షాలు నేలవాలాయి. -
బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి నాగార్జున
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో వరి పంట దెబ్బతిన్న బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి నాగార్జున భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో పలుచోట్ల వర్షాలకు నేలవాలిన వరి పంటను ఆయన మంగళవారం పరిశీలించారు. -
కష్టాలు ఆవరించి.. ఆశలు నేలకూర్చి
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని అధికారులు, సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
జనజీవనం అస్తవ్యస్తం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టలేకపోయారు. వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
‘దుకాణం ధ్వంసం చేశారు’
[ 06-12-2023]
తన అద్దె దుకాణాన్ని సంబంధిత యజమాని, స్థానిక వైకాపా నాయకులతో కలిసి ధ్వంసం చేయించారని వ్యాపారి పెదబాబు ఆరోపించారు. -
చాట, చీపిరితోనే శుభ్రం చేస్తారా..?
[ 06-12-2023]
ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేల మంది రోగులు, సహాయకులు వస్తుంటే పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఏజైల్ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట డాక్టర్ కిరణ్‌కుమార్ మంగళవారం తెలిపారు. -
అమరావతి ఉద్యమం.. రాజకీయాలకు అతీతం
[ 06-12-2023]
అమరావతి ఉద్యమం కులమతాలు, పార్టీలకు అతీతంగా జరుగుతోందని రాజధాని రైతులు పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 1,449వ రోజుకు చేరాయి. -
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూంను సందర్శించి అక్కడకు వస్తున్న ఫోన్‌కాల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వ్యవసాయంలో నికర ఆదాయమే ప్రధానం
[ 06-12-2023]
రైతులు యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తే మేలని జాతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ సంచాలకులు డాక్టర్ ఆర్.కె.మాధూర్ తెలిపారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సు మంగళవారంతో ముగిసింది. -
గర్జించిన మిగ్జాం
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఒకవైపు వర్షం.. మరోవైపు ఈదురుగాలుల ధాటికి ప్రజలు రహదారుల మీదకు రావడానికి భయపడ్డారు. -
కల్లాల్లో కల్లోలం
[ 06-12-2023]
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత మిగులుతాయని అనుకుంటున్న తరుణంలో వర్షాలతో ఆశలు గల్లంతయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
ప్రకాశం జిల్లాలో దారుణం.. పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
-
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
-
SI Exam Results: ఏపీలో ఎస్సై పరీక్ష తుది ఫలితాలు విడుదల
-
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
INDw vs ENGw: అర్ధ శతకాలతో విరుచుకుపడ్డ నాట్ సీవర్, డేనియల్.. టీమ్ఇండియా ముందు భారీ టార్గెట్