logo

నిజమైన లబ్ధిదారులకు సహకరించండి

జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న నిజమైన లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించాలని డీఆర్వో వినాయకం అన్నారు.

Published : 24 Sep 2023 05:50 IST

మాట్లాడుతున్న డీఆర్వో వినాయకం

నరసరావుపేట అర్బన్‌: జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న నిజమైన లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించాలని డీఆర్వో వినాయకం అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ పారిశ్రామిక విధానం 2020-23ను సక్రమంగా అమలు చేయడంతో పాటు నూతన విధానంపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు పారిశ్రామికాభివృద్ధి చెందాలన్నారు. నూతన పారిశ్రామిక విధానం అమలు, జిల్లాలో పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు, క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌, ప్రధానమంత్రి ఉపాధికల్పన కార్యక్రమం తదితర అంశాలపై చర్చించారు. పరిశ్రమలశాఖ మేనేజర్‌ వెంకటేశ్వరరావు, డీఐసీ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని