ఎంవీఐ కార్యాలయానికి తొలగిన అడ్డంకులు
అద్దంకి ఎంవీఐ కార్యాలయం ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. ఈ నెల 25 నుంచి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా రవాణాధికారి ఎ.చంద్రశేఖరరెడ్డి చెప్పారు.
సోమవారం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు, సామర్థ్య పరీక్షలు
ప్రభుత్వ భూమిలో తొలగిస్తున్న చిల్లచెట్లు
శింగరకొంè [(అద్దంకి), న్యూస్‌టుడే : అద్దంకి ఎంవీఐ కార్యాలయం ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. ఈ నెల 25 నుంచి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా రవాణాధికారి ఎ.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అద్దంకి కార్యాలయానికి ఎంవీఐ అధికారిని నియమిస్తారని, వారి ద్వారా అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
కార్యాలయ ఏర్పాటుకు ఒడుదొడుకులు: అద్దంకి ఎంవీఐ కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా ఆదేశాలిచ్చారు. ఆ మేరకు ప్రాంతీయ సంయుక్త రవాణా శాఖాధికారి డాక్టర్ బి.కృష్ణవేణి సూచనల మేరకు అద్దంకిలో ఎంవీఐ కార్యాలయం ప్రారంభోత్సవానికి మార్గనిర్దేశం చేశారు. ఖాళీగా ఉన్న క్రీడా వికాస కేంద్రాన్ని ఎంపిక చేసుకోగా.. పురపాలక కమిషనర్, వైస్‌ఛైర్మన్ తదితరులతో కలిసి దానిని పరిశీలించారు. విషయం తెలుసుకున్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాల్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు క్రీడా శిక్షకులు గురువారం క్రీడా ప్రాంగణానికి తలుపులు వేశారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లేకుండా ఎవరికీ కేటాయించేది లేదని భీష్మించారు.
ఏర్పాటుకు ప్రయత్నాలు: అద్దంకిలో ఎంవీఐ కార్యాలయం ఏర్పాటును రవాణాశాఖాధికారులు ప్రతిష్ఠాత్మకంగా భావించారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కలుగుతున్న ఆటంకాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కనీసం మూడెకరాల ప్రభుత్వ భూమిని కార్యాలయానికి కేటాయించాల్సిందిగా రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించిన రెవెన్యూ అధికారులు క్రీడా వికాస కేంద్రం ఎదుట భూమిని కేటాయించారు. కానీ వెంటనే పనులు పూర్తి కానందున తాత్కాలిక ప్రాతిపదికన క్రీడాప్రాంగణానికి చెందిన ఒక గదిని కేటాయించాల్సిందిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అంగీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
నడవలేని స్థితి వరకు ఐపీఎల్ ఆడతా
-
క్రికెట్ మరీ ఎక్కువైపోతోంది.. అందుకే ఆల్‌రౌండర్ల కొరత
-
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్‌లతో జాగ్రత్త!
-
Shah Rukh Khan: ఆ క్షణం ప్రపంచానికి రాజునయ్యాననిపించింది: షారుక్
-
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
-
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?