logo

లక్ష్మీ నారసింహా పాహిమాం...

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో మంగళవారం వేడుకగా పవిత్రోత్సవాలు నిర్వహించారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేతుడైన నృసింహ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు.

Published : 27 Sep 2023 05:33 IST

పూజించిన పవిత్రాలు తీసుకెళ్తున్న అర్చక స్వాములు

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో మంగళవారం వేడుకగా పవిత్రోత్సవాలు నిర్వహించారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేతుడైన నృసింహ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ రాజగోపురంపై కలశాలకు పవిత్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. సాయంత్రం పంచసూక్త, మహాశాంతి హోమం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని