logo

‘మాట తప్పిన సీఎం జగన్‌’

వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పారని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ విమర్శించారు.

Published : 27 Sep 2023 05:33 IST

  నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

రేపల్లె, న్యూస్‌టుడే : వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పారని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ విమర్శించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేసేందుకు విజయవాడ వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొంటూ ఆర్టీసీ బస్టాండ్‌ కూడలిలో నల్లరిబ్బన్లు ధరించి ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసుల ద్వారా పాలన సాగించాలనుకుంటే భవిష్యత్తులో ఇంటిదోవ పట్టటం తప్పదన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారని కుటుంబ సభ్యులను కూడా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిర్బంధాలను అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు ఆమోదిస్తూ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రదర్శనలో సంఘ నేతలు కె.రత్నకుమారి, హేమలత, రజని, సీఐటీయూ నాయకులు కె.రమేష్‌, జె.ధర్మరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని