logo

జలదిగ్బంధంలో విఠలేశ్వర నగర్‌

వర్షం కురిస్తే రహదారులు జలమయం. భారీవర్షమైతే గృహాలను నీరు చుట్టుముడుతుంది. ఇది స్థానిక విఠలేశ్వరనగô్ పరిస్థితి. రెండుమూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కాలనీ మొత్తం జలదిగ్బంధంలో ఉంటోంది.

Updated : 27 Sep 2023 06:19 IST

గృహాలను చుట్టుముట్టిన వర్షపునీరు

భట్టిప్రోలు, న్యూస్‌టుడే : వర్షం కురిస్తే రహదారులు జలమయం. భారీవర్షమైతే గృహాలను నీరు చుట్టుముడుతుంది. ఇది స్థానిక విఠలేశ్వరనగర్‌ పరిస్థితి. రెండుమూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కాలనీ మొత్తం జలదిగ్బంధంలో ఉంటోంది. పది రోజుల క్రితం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి డాక్టరు మేరుగ నాగార్జున పర్యటించే ముందు అధికారులు వర్షం నీరు నిల్వ లేకుండా బయటకు పంపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కాలనీని సందర్శించారు. కానీ ఫలితం ఏమీ లేదని గ్రామస్థులు వాపోయారు. మంత్రి నాగార్జున తిరుగుతారని ఆ రోజు మాత్రం  లారీ డస్టును వేసి గుంతలను పూడ్చారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చి కాలనీవాసులకు వాగ్దానం చేశారు. కానీ నేటికి పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు అడుగుల లోతులో నీరు ఉండటంతో కాలనీవాసులు బయటకు రాలేకపోతున్నమని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం హాయాంలో రహదారి పనులు ప్రారంభించారు. ఎన్నికల సమయం రావడంతో పనులు నిలిచాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే ఆ నీటిలో నడిచి వెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు. కాలనీ పక్కనే చెరువు ఉండటంతో చెరువు పొంగి మరింత నీరు ఎక్కువతోంది. దోమలు మోతకి అల్లాడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరాలు ప్రబలుతాయేమోనని భయపడుతున్నారు. నీరు నిల్వతో డెంగీ దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాలనీవాసులు అనారోగ్యానికి గురికాకముందే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈవిషయంపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసు మాట్లాడుతూ కాలనీని పరిశీలించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని