logo

Hyd: రాత్రి 9.45 గంటల వరకు మెట్రో

మెట్రో రైలు వేళలను రాత్రి పూట పొడిగించారు. ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9 గంటలకు కాకుండా 9.45 గంటలకు బయలుదేరుతుంది.

Updated : 02 Jul 2021 07:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైలు వేళలను రాత్రి పూట పొడిగించారు. ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9 గంటలకు కాకుండా 9.45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 10.45 గంటలకు గమ్య స్థానం చేరుతుంది. రాత్రి ఆలస్యంగా విధులు ముగించుకుని ఇంటికెళ్లేవారికి పెంచిన వేళలతో ప్రజా రవాణా అందుబాటులో ఉండనుంది. శుక్రవారం నుంచి పెంచిన మెట్రో వేళలు అమల్లోకి వస్తాయని ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. ప్రయాణికులందరి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు విధిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించి సహకరించాలని ఆయన కోరారు. ప్రయాణికుల నుంచి ఆదరణ పొందేందుకు రాత్రి మెట్రో వేళల్ని పెంచాలని ‘ఈనాడు’లో బుధవారం కథనం ప్రచురితమైంది. స్పందించిన మెట్రో అధికారులు ఈ మేరకు మెట్రో వేళలను పొడిగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని