Crime News: క్రికెటే ప్రాణం.. పరీక్షలంటే భయంతో బలవన్మరణం
భవనం పైనుంచి దూకి విద్యార్థి బలవన్మరణం
కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఫెయిల్ అవడంతో మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లోని భువన విజయం మైదానం సమీపంలోని కల్యాణి-జేవీన్ సుందర్ వర్మ దంపతుల కుటుంబం నివాసముంటోంది. వీరి పెద్ద కుమారుడు రిత్విక్(21) ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చుదువుతున్నాడు. రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి బ్యాక్‌లాగ్స్ ఉండటంతో ఇటీవల ఒత్తిడికి గురవుతున్నాడు. అతడికి క్రికెట్ అంటే ఇష్టం. ఇంటికి సమీపంలో కోచింగ్ కూడా వెళ్తున్నాడు. రిత్విక్‌కు రానురాను ఆటపై మోజు పెరిగి చదువుపై శ్రద్ధ తగ్గింది. మరోవైపు బ్యాక్‌లాగ్స్ ఉండటంతో వేదనకు గురయ్యాడు. ఈనెల 11న రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో అందరూ నిద్రించారు. 12న తెల్లవారుజామున శబ్దం రావడంతో పక్కింటి అతను కల్యాణి-సుందర్ వర్మ కుటుంబం ఉంటున్న ఇంటి కాపలాదారుని అప్రమత్తం చేసి కింద చూసేసరికి రిత్విక్ అచేతనంగా పడి ఉన్నాడు. భవనం పైఅంతస్తు నుంచి దూకినట్లు గుర్తించి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.