logo
Updated : 02 Oct 2021 11:32 IST

TS News: నకిలీ వీడియోలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్న యూట్యూబర్‌ అరెస్టు


సునిషిత్‌

కీసర, న్యూస్‌టుడే: నకిలీ వీడియోలను సృష్టించి ఓ పోలీసు అధికారిపై తప్పుడు ఆరోపణలు చేసిన యూట్యూబర్‌పై శుక్రవారం కీసర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జనగాం జిల్లాకు చెందిన ఆర్‌.సునిషిత్‌(32) ఎంటెక్‌ చదివాడు. చదువు పూర్తయిన తర్వాత ఓ కళాశాలలో పని చేస్తున్నపుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత 2014లో నివాసాన్ని రాంపల్లి ఆర్‌ఎల్‌నగర్‌కి మార్చాడు. ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు. రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రముఖులపై వ్యాఖ్యానిస్తే ఉచితంగా ప్రచారం పొందొచ్చని భావించి పలువురు సినీ ప్రముఖులపై తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఈ విషయంలో గత ఏడాది అతనిపై కేసు నమోదై రిమాండ్‌కు వెళ్లాడు. తరువాత సునిషిత్‌ టీవీ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించాడు. వివాదస్పద వీడియోలను పోస్ట్‌ చేయడం ప్రారంభించాడు. ఇటీవల మల్కాజిగిరి స్టేషన్‌లో పని చేసే ఓ పోలీసు అధికారిపై తప్పుడు వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పుడు వీడియో ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడని కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని