logo
Updated : 06 Oct 2021 09:40 IST

TSRTC: ఊరెళ్లాలా.. ఇక్కడకు రండి

బేగంబజార్‌, న్యూస్‌టుడే: దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 4,035 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌ వెల్లడించారు. మంగళవారం ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

ఎక్కడి నుంచి.. ఏయే ప్రాంతాలకు బస్సులు

1. ఎంజీబీఎస్‌..: గరుడ, గరుడప్లస్‌తో పాటు బెంగళూరు, ఖమ్మం వైపు వెళ్లే అన్ని బస్సులు, శ్రీశైలం, కల్వకుర్తి, రాయచూర్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, షాద్‌నగర్‌, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, పెబ్బేరు, కొత్తకోట, జోగులాంబ గద్వాల, మెదక్‌, బాన్సువాడ, బోధన్‌, జహీరాబాద్‌, బీదర్‌, నారాయణ్‌ఖేడ్‌, సంగారెడ్డి, నాగ్‌పూర్‌, అమరావతి, నాందేడ్‌, అకోల(మహారాష్ట్ర), దేవరకొండ, పరిగి, తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాలకు వెళ్లే బస్సులు బయలుదేరుతాయి.

2. జేబీఎస్‌..: కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ వైపు వెళ్లే అన్ని బస్సులు

3. ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు..: యాదగిరిగుట్ట, పరకాల, జనగాం, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూరు, వరంగల్‌ వైపు వెళ్లే బస్సులు

4. దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌..: మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు

5. సీబీఎస్‌..: కర్నూలు వైపు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, మదనపల్లికి వెళ్లే బస్సులు బయలుదేరుతాయి.

* ప్రయాణికుల సౌకర్యార్థం విచారణ కేంద్రం ఫోన్‌ నంబర్లు ఎంజీబీఎస్‌- 99592 26257,   జేబీఎస్‌-040-27802203, ఆ  ర్టీసీ అధీకృత ఏజెంట్లు అందుబాటులో ఉంటారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని