Hyderabad Metro: కనికరం చూపలేదు.. అమ్మకు చోటులేదు!
ఒడిలో పసికందుతో మెట్రోరైలు ఎక్కిందా మహిళ. అప్పటికే సీట్లన్నీ నిండిపోయాయి. అక్కడ కూర్చున్న వారిలో యువతులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. చేతుల్లో శిశువుతో ఉన్న ఆ అమ్మను చూసి చూడనట్టుగా ఉండిపోయారు. కదిలే రైలులో పసిబిడ్డతో ఆ అమ్మ ఎక్కువ సేపు నిలబడలేకపోయింది
మెట్రోరైలులో పసికందుతో కింద కూర్చున్న మహిళ
ఈనాడు, హైదరాబాద్: ఒడిలో పసికందుతో మెట్రోరైలు ఎక్కిందా మహిళ. అప్పటికే సీట్లన్నీ నిండిపోయాయి. అక్కడ కూర్చున్న వారిలో యువతులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. చేతుల్లో శిశువుతో ఉన్న ఆ అమ్మను చూసి చూడనట్టుగా ఉండిపోయారు. కదిలే రైలులో పసిబిడ్డతో ఆ అమ్మ ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. కింద కూర్చుని.. ఒళ్లో బిడ్డను ఉంచుకుని గమ్యం వరకూ ప్రయాణించింది. హైదరాబాద్ మెట్రోలో జరిగిన సంఘటనను ఎవరో వీడియోతీసి ‘గ్రేట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ హైదరాబాద్’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. గర్భిణులు.. చంటిపిల్లలతో ఉన్న మహిళలు కనిపించగానే కూర్చున్న సీటును ఇవ్వటం సాధారణంగా చూస్తుంటాం. మెట్రోరైలులో అక్కడ ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవటం.. బాలింత అనే కనికరం చూపకపోవటంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత పెద్దచదువులు పూర్తిచేసిన మహిళలు.. కనీస మానవత్వం చూపకపోవటం దారుణమంటున్నారు. మెట్రోరైలులో జరిగిన ఘటనపై హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి స్పందించారు. ఇది బాధాకరం. తోటి ప్రయాణికులు సీటిచ్చి సహకరించాల్సి ఉంది. అలా చేయకపోవటం బాధగా అనిపించింది. మనం కట్టుబడి ఉన్న సామాజిక విలువలను ప్రశ్నించేదిగా ఉంది. పసికందును భద్రంగా పట్టుకుని కిందకూర్చుని ప్రయాణించిన ఆమెలో నిజమైన భారతీయ మాతృ హృదయ గొప్పతనం కనిపించిందంటూ ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్‌ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్‌పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్‌రెడ్డి, ఎం.విజయ్‌కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి