Updated : 28 Oct 2021 09:29 IST
TS News: ఒకే కాన్పులో నలుగురు శిశువులు.. తల్లి, బిడ్డలు క్షేమం
మెహిదీపట్నం, న్యూస్టుడే: మెహిదీపట్నంలోని మీనా ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చారు. బుధవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా.సోహెబా షుకూర్ వైద్య బృందం వివరాలు వెల్లడించింది. పాతబస్తీలోని హఫీజ్బాబానగర్కు చెందిన మహిళ ప్రసవం కోసం మంగళవారం చేరారు. ముగ్గురు ఆడ, ఒక మగ శిశువు పుట్టగా.. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మగ శిశువు 1500 గ్రాములు, ఆడ శిశువులు 1500, 1400, 1300 గ్రాముల బరువు ఉన్నట్లు వివరించారు.
Tags :