logo
Updated : 05 Nov 2021 10:15 IST

Suicide: సంసారంలో కలతలు.. ఇద్దరి బలవన్మరణం

ఒకచోట భర్త, మరో ఘటనలో భార్య..

శాంత

న్యూస్‌టుడే - నర్సాపూర్‌ రూరల్‌, పెద్దశంకరంపేట: దంపతుల మధ్య గొడవ చివరికి ముగ్గురు పిల్లల తల్లి బలవన్మరణానికి దారి తీసింది. ఈ ఘటన నర్సాపూర్‌ మండలం నత్నాయిపల్లిలో జరిగింది. ఎస్సై గంగరాజు తెలిపిన వివరాలు.. నత్నాయిపల్లికి చెందిన శాంత(36), బాన్సువాడ మండలం కొయ్యగుట్టకు చెందిన రమేశ్‌కు పదేళ్ల లోపు ముగ్గురు పిల్లలున్నారు. వారం రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శాంత పిల్లలను తీసుకొని తల్లిగారిల్లు నత్నాయిపల్లికి వచ్చింది. దీపావళి తర్వాత మాట్లాడుకుందామని ఆమె తల్లిదండ్రులు రమేశ్‌కు ఫోన్‌లో చెప్పారు. తమ పనులపై వెళ్లిపోయారు. బుధవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోకి వెళ్లి రేకుల కర్రకు చీరతో ఉరి వేసుకుంది. పెద్ద కూతురు గమనించి అరవడంతో తల్లిదండ్రులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే శాంత చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం గొట్టిముక్కల గ్రామానికి చెందిన వడ్ల ప్రశాంత్‌ (30)కు మూడేళ్ల క్రితం పెళ్లయింది. భార్యతో మనస్పర్థలు వచ్చి ఎనిమిది నెలల క్రితం విడిగా ఉంటున్నారు. అప్పటినుంచి ఆవేదనకు గురి అవుతున్నాడు. ప్రశాంత్‌ తన తండ్రి విఠల్‌ వెంట తొగరి పంటకు రసాయన మందు చల్లడానికి బుధవారం వెళ్లాడు. అంతలో పెట్రోల్‌ అయిపోయిందని తీసుకు వస్తానని తండ్రితో చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. సాయంత్రం గ్రామ శివారులోని చెరువు వద్ద పొదల్లో ప్రశాంత్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గ్రామస్థులు చూసి తండ్రికి చెప్పారు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని