logo
Published : 07 Nov 2021 06:57 IST

TSRTC: ఓ ట్వీటు.. మరిచిన చిల్లర వెనక్కొచ్చేట్లు!

జీడిమెట్ల, న్యూస్‌టుడే: రూ.వంద, రూ.500 నోటు కండక్టరు చేతిలో పెట్టగానే.. టిక్కెట్టు కొట్టి మిగతా చిల్లరంతా వెనక రాయడం ఆర్టీసీలో షరా మామూలే. అవి మరిచిపోయి దిగిపోవడమూ తరచూ జరిగేవే. అయితే ఓ విద్యార్థి ట్వీట్‌ ద్వారా తన డబ్బు వెనక్కి తెచ్చుకొన్నాడు. ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించి డబ్బు పంపేలా చేశారు. సీతాఫల్‌మండికి చెందిన లిక్కిరాజు గురువారం బాలానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కి రూ.100 నోటిచ్చాడు. దిగేటప్పుడు మిగతా డబ్బు తీసుకోమంటూ కండక్టర్‌ టిక్కెట్‌ వెనక రూ.80 రాశారు. గమ్యస్థానం రాగానే ఆ విషయం మర్చిపోయి దిగిపోయిన విద్యార్థికి జేబులో ఒక్క రూపాయీ లేకపోవడంతో చేసేదేం లేక నడుచుకుంటూ ఇంటికెళ్లిపోయాడు. తుది ప్రయత్నంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్‌ చేస్తూ తన బాధ వెళ్లగక్కాడు. వెంటనే స్పందించిన ఆయన జీడిమెట్ల డిపో మేనేజర్‌ మురళీధర్‌రెడ్డిని పరిశీలించమని ఆదేశించారు. శనివారం ఆ ప్రయాణికుడికి చెల్లించాల్సిన రూ.80ని డిపో మేనేజర్‌ ఫోన్‌పే ద్వారా పంపించారు. ఎండీ, డిపో మేనేజర్ల తక్షణ స్పందనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని