logo
Published : 15 Nov 2021 08:06 IST

Suicide: భార్య వేధిస్తోందని జీవితం చాలించిన భర్త

గోల్కొండ, న్యూస్‌టుడే: ‘‘అమ్మా నన్ను క్షమించు.. ఎంతో జీవితాన్ని చూడాలనున్నా చావక తప్పట్లేదు. నా కొడుకుని ఉన్నత స్థితిలో ఉండేలా చదివిద్దామనుకున్నా. మంచి స్కూల్‌లో చేర్పించా. కానీ నా భార్య అవేం చేయనీట్లేదు. ఎప్పుడూ ఏవో గొడవలు. పుట్టింటోళ్లతో కలిసి హత్యకు యత్నించింది. ఆమె కోసం మిమ్మల్ని కాదనుకున్నా.. అక్కా క్షమించండి.. అందరికి గుడ్‌బై’’ అంటూ ఓ వ్యక్తి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గోల్కొండ ఎస్సై వెంకటరమణ కథనం ప్రకారం.. షేక్‌పేటకు చెందిన సంతోష్‌(37) ఎంబీఏ చదివాడు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫలక్‌నుమాకు చెందిన యువతితో 2013లో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు. కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో భార్య భరోసా సెంటర్‌ను ఆశ్రయించింది. ఆగస్టు నుంచి ఆమె కుమారుడితో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడక ముందు సంతోష్‌ ఓ వీడియో చిత్రీకరించాడు. తన చావుకు భార్య, అత్తామామలు, బావమరిది, చిన్నమామ కారణమని ఆ వీడియో ద్వారా వివరించాడు. ఈ నలుగురికి శిక్ష పడేలా చూడాలని అన్నయ్య అన్వేష్‌ను కోరాడు. అనంతరం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకున్న పురుగుల మందును శీతల పానీయంలో కలుపుకొని తాగాడు. అస్వస్థతకు గురై పడిపోవడంతో గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంతోష్‌ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని