TS News: ఆడపిల్ల పుట్టిందని గెంటేసిన భర్త.. విషం తాగిన భార్య
కాటేదాన్, న్యూస్‌టుడే: ఆడపిల్ల పుట్టిందని తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటేసిన భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసింది. పహాడీషరీఫ్ ఎస్సై హయూం కథనం ప్రకారం...తూర్పుగోదావరి జిల్లా వీరపాలెంకు చెందిన పుణ్యవంతుల శ్రీను కుటుంబం తుక్కుగూడ పురపాలిక మంఖాల్‌లో స్థిరపడింది. అతను మంఖాల్‌లోని ఫాంహౌస్‌లో పనిచేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న తమ జిల్లా వాసి రాజేష్(26)కు తన కుమార్తె మానసను ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెకు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి రాజేష్ వేధించసాగాడు. సోమవారం ఇదే విషయంపై ఆమెను కొట్టి పుట్టింటికి పంపించేశాడు. తండ్రితో కలిసి మానస సోమవారం సాయంత్రం పహాడీషరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఇంటికి వెళ్లగానే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.