logo
Published : 27/11/2021 01:02 IST

స్టార్టప్‌ లాంఛర్‌ ప్రోగ్రాంలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ది ఎంటర్‌ప్రెన్యూర్‌ జోన్‌(టీఈజెడ్‌) సంయుక్తంగా నిర్వహిస్తున్న స్టార్టప్‌ లాంఛర్‌ ప్రోగ్రాం(ఎస్‌ఎల్‌పీ)లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 3 నెలల ఈ ప్రోగ్రాంలో భాగంగా అంకుర సంస్థల నిర్వహణ, పెట్టుబడి, మార్కెటింగ్‌, వినియోగదారులను గుర్తించడం ఇలా విభిన్న అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వైవిధ్యమైన సరికొత్త ఆలోచనలతో అంకుర సంస్థలు ప్రారంభించాలనే ఆలోచన కలిగిన వ్యక్తులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు చేరేందుకు అర్హులని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్‌ 7 లోపు దరఖాస్తులు సమర్పించాలి. వివరాలకు 76608 57600 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని