logo
Published : 27/11/2021 01:02 IST

పోలీసులకు చిక్కిన దారిదోపిడీ ముఠా

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: దారి దోపిడీ దొంగలను ఎట్టకేలకు పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకొన్నారు. వ్యసనాలకు బానిసై అయిదేళ్లుగా జంటనగరాల్లో నేరాలకు పాల్పడుతున్న అయిదుగురి ముఠాను కటకటాల వెనక్కి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న అర్ధరాత్రి 1.15 సమయంలో రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన నలుగురు అగంతకులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 92లో ద్విచక్రవాహంపై వెళ్తున్న ముగ్గురిని అడ్డుకొని డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఇవ్వడానికి వారు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన అగంతుకులు అబ్దుల్‌ గౌస్‌, సయ్యద్‌ జిలాని అలియాస్‌ ఇచో తమ వద్ద ఉన్న కత్తితో వారిలో ఒకరిని గాయపర్చి ద్విచక్రవాహనాన్ని లాక్కెళ్లారు. అక్కడే ఉన్న మరో ఆటోడ్రైవరును కొట్టి చరవాణి, రూ.1900 నగదు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 2 గంటల తర్వాత ఈ ముఠా మలక్‌పేట రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లి ఇద్దరిని డబ్బులు, చరవాణి కావాలని బెదిరించారు. ఈ క్రమంలో మహమ్మద్‌ మహమూద్‌ కత్తితో ఒకరిపై దాడి చేశాడు. ఈక్రమంలోనే మహమూద్‌కు సైతం తీవ్ర గాయమై అక్కడే ఉన్న స్థానికులకు చిక్కాడు. దీంతో అతడిని చాదర్‌ఘట్‌ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితులు మల్కాజిగిరి ప్రాంతంలోని గోకుల్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ అఫ్రోజ్‌ అలీ, ఆజంపురకు చెందిన అబ్దుల్‌ గౌస్‌ చంచల్‌గూడకు చెందిన ఇచో, మహ్మద్‌ ముస్తాక్‌ ఖాన్‌, మహ్మద్‌ అర్బాజ్‌గా గుర్తించారు. వీరిలో అఫ్రోజ్‌ అలీ బృందానికి కీలకంగా వ్యవహరిస్తుంటాడు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మహబూబ్‌నగర్‌, కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతాల్లో 46 దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్‌ నేరాలలో ఇతడు నిందితుడు.ఇతను పీడీ చట్టం కింద అరెస్ట్‌ అయ్యి తిరిగి వచ్చాడు. సయ్యద్‌ జిలాని సైతం ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీరి నుంచి మూడు కాగితాలు కత్తిరించే బ్లేడ్లు, మిరప పొడి, మూడు ద్విచక్రవాహనాలు, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని