logo
Updated : 27/11/2021 02:15 IST

పరీక్షలకు దూరం.. జీవితమే పణం!

క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై మహిళల అనాసక్తి

గ్రేటర్‌లోనూ ఇదే తీరు..

ఈనాడు, హైదరాబాద్‌: ఎంతోమంది మహిళలను పొట్టన పెట్టుకుంటున్న వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన కొరవడుతోంది. ముందుస్తు పరీక్షలతో పలు క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది ముందుకు రావడం లేదు. గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రొమ్ము, సర్విక్స్‌, ఓరల్‌ క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్‌ విషయంలో మహిళలు దూరంగా ఉంటున్నారు. 2019-20 ఏడాదికి సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రెండో విడత నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. చైతన్యలేమి.. సామాజిక బిడియం.. ఇతరత్రా కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా 30-49 ఏళ్ల వయసులో మహిళలు ఏటా ఒకసారి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముందుస్తు పరీక్షల ద్వారా రొమ్ము, సర్విక్స్‌, నోటి, గొంతు క్యాన్సర్లను పూర్తిగా నియంత్రించవచ్చని పేర్కొంటున్నారు. నాంపల్లి ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికి చికిత్స పొందేందుకు వస్తున్న మహిళల్లో 14 శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు(సర్విక్స్‌), మరో 13 శాతం రొమ్ము క్యాన్సర్‌ బాధితులు ఉంటున్నారు. అందులో కూడా 80 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా చికిత్స చేసినా సరే.. ఫలితం ఉండటం లేదని వైద్యులు వాపోతున్నారు. ముఖ్యంగా సర్విక్స్‌ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని సూచిస్తున్నారు. 10-12 ఏళ్ల వయసులో బాలికలకు హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ ఇప్పించడం ద్వారా పూర్తిగా ఈ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడవచ్ఛు అంతేకాక 30-49 ఏళ్లు దాటిన మహిళలు ఏటా మమోగ్రామ్‌, పాప్సీమీర్‌ పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము, సర్విక్స్‌ క్యాన్సర్ల నుంచి పూర్తిగా రక్షణ పొందే అవకాశం ఉంది. అయితే 99 శాతం మంది మహిళలు ఇప్పటికీ ఈ పరీక్షలకు దూరమే. ఏదైనా సమస్య వచ్చినప్పుడే వైద్యుల వద్దకు వెళ్తున్నారు. అప్పటికే క్యాన్సర్లు రెండు, మూడు దశలు దాటిపోతున్నాయి.


ఎంఎన్‌జేలో స్క్రీనింగ్‌కు ప్రత్యేక శిబిరం

-డాక్టర్‌ జయలత, డైరెక్టర్‌, ఎంఎన్‌జే ఆసుపత్రి

ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో స్క్రీనింగ్‌ పరీక్షల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశాం. గత రెండు నెలలుగా దీనిపై పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యేక కేంద్రాల ద్వారా 10 వేల మంది మహిళలకు పరీక్షలు నిర్వహించాం. ఇందులో 200-300 మందిలో వివిధ రకాల క్యాన్సర్ల లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎంఎన్‌జేలో ఈ పరీక్షలన్నీ ఉచితం. ఎప్పుడైనా వచ్చి చేయించుకోవచ్ఛు వివరాలకు డాక్టర్‌ సౌజన్య(96424 61199)ను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్ఛు

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని